Home  »  TV News  »  Karthika Deepam2 :  చైర్మెన్ సీటుపై జ్యోత్స్న కన్ను.. బోర్డు మీటింగ్‌లో దశరథ్ అభ్యంతరం!

Updated : May 16, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(Karthika Deepam2 ).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -671 లో.... మీటింగ్ అయ్యాక అందరు బయటకు వస్తారు. జ్యోత్స్నని సీఈఓగా చెయ్యడానికి రెండు కారణాలున్నాయి. ఒకటి మనం ఆ రోజు అనుకుందే తను కూడా అంది.. తనకి కాబోయే భర్త సీఈఓ ఒకరే అవ్వాలని, రెండు సుమిత్ర ముందే తను సీఈఓ గురించి మాట్లాడింది.. తన సంతోషం కోసం ఒప్పుకోక తప్పలేదని శివన్నారాయణ అంటాడు. అప్పుడే దశరథ్ వస్తాడు. నెల్లూరు రెస్టారెంట్ లో ప్రాబ్లమ్ ఏం లేదు నాన్న అని చెప్తాడు. అక్కడ నుండి శ్రీధర్, శివన్నారాయణ వెళ్ళిపోతారు. జ్యోత్స్న నన్ను మీటింగ్ లో లేకుండా కావాలనే ప్రాబ్లమ్ ఉందని చెప్పి ఫోన్ చేయించి నేను వెళ్లేలా చేసిందని కార్తీక్ తో దశరథ్ చెప్తాడు. నన్ను కూడా అలాగే చేసిందని కార్తీక్ చెప్తాడు. ఆ తర్వాత అనుకున్నది చేసావని జ్యోత్స్నని పారిజాతం మెచ్చుకుంటుంది. నాకు సీఈఓ కాదు చైర్మెన్ అవ్వాలని ఉందని జ్యోత్స్న అంటుంది. మీ తాత సీట్ కే ఎసరు పెట్టావా అని పారిజాతం అంటుంది. నాకు మొత్తం ఆస్తి వస్తుందంటే దీప ఉరుకుంటుందా అని జ్యోత్స్న అంటుంది. ఇక ఎవరినో ఒకరిని చూసుకొని పెళ్లి చేసుకుంటే ఆస్తి మొత్తం నీదే అని పారిజాతం అంటుంది. అలా చేసుకోనని జ్యోత్స్న అంటుంది. అంటే పెళ్లి చేసుకుంటానని అబద్ధం చెప్పావా అని పారిజాతం అడుగుతుంది.

నేను బావని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనని జ్యోత్స్న అంటుంది. అంటే నీకు ఇంకా కార్తీక్ పై ఇష్టం తగ్గలేదా అని పారిజాతం అడుగుతుంది. లేదని జ్యోత్స్న అంటుంది. మరొకవైపు దీప, కార్తీక్ వెళ్తుంటే వాళ్ళతో జ్యోత్స్న మాట్లాడుతుంది. మీరు నాకు నెల రోజుల్లో పెళ్లి చేస్తానని వార్నింగ్ లాంటి ఛాలెంజ్ చేసారు కదా ఒకవేళ అలా చెయ్యకపోతే ఏం చేస్తారని జ్యోత్స్న అడుగుతుంది. నువ్వు అడిగింది చేస్తానని దీప చెప్తుంది. నువ్వు ఏం అంటావ్.. బావ అని జ్యోత్స్న అడుగుతుంది. మా ఇద్దరిది ఒకే మాట అని కార్తీక్ అంటాడు. ఆ మాటలన్నీ శ్రీధర్ వింటాడు. మిమ్మల్ని డ్రాప్ చెస్తానని కార్తీక్, దీపతో జ్యోత్స్న అంటుంది. అప్పుడే ఎదురుగా శ్రీధర్ ఉంటాడు. నేను వాళ్ళని డ్రాప్ చేస్తానని శ్రీధర్ అనగానే వద్దు నేను చేస్తాను మావయ్య అని జ్యోత్స్న అంటుంది. 

ఆ తర్వాత కాంచన దగ్గరికి శ్రీధర్ వెళ్లి.. వాళ్ళు మాట్లాడుకుంది చెప్తాడు. ఏదో పెద్ద కారణం ఉంది కార్తీక్ రాగానే అడగాలని శ్రీధర్ అంటాడు. అప్పుడే కార్తీక్, దీప వస్తారు. కార్తీక్ ని శ్రీధర్ పక్కకి తీసుకొని వెళ్తాడు. మీరు ఇందాక మాట్లాడుకుంది విన్నాను.. మీరు నెలరోజుల్లో  తనకి పెళ్లి చెయ్యకపోతే తను అడిగింది చేస్తానన్నారు.. ఒకవేళ నిన్ను తన మెడలో తాళి కట్టమంటుంది కడతావా అని శ్రీధర్ అడుగుతాడు. అలా ఏం జరగదు నెల రోజుల్లో పెళ్లి చేస్తానని కార్తీక్ అంటాడు. అసలు ఆ ఇంటికి దీపకి సంబంధం ఏంటని శ్రీధర్ అడుగుతాడు. ఉంది కానీ అది ఇప్పుడు చెప్పను తెలిసిన రోజున మీ దగ్గర ప్రశ్నలు ఉండవని కార్తీక్ అంటాడు. మీరు ఎక్కువ స్ట్రైన్ అవ్వకండి.. వెళ్ళండి అని కార్తీక్ అనగానే శ్రీధర్ వెళ్ళిపోతాడు. మరుసటిరోజు బోర్డు మీటింగ్ జరుగుతుంది.. నిన్న మీటింగ్ కి నేను లేను.. సీఈఓ విషయంలో నా అభిప్రాయం నాకు ఉంటుంది కదా అని దశరథ్ అంటాడు. కార్తీక్ ఉంటే బాగుంటుందని కొంతమంది అంటారు కానీ నేను ఉండనని కార్తీక్ చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.